హై రిస్క్ కరోనా వార్డుల్లో చికిత్స కోసం మెడి-సారథి

ABN , First Publish Date - 2020-07-09T01:39:01+05:30 IST

చండీగఢ్: కరోనా వేళ పంజాబ్ ఐఐటీ శాస్త్రవేత్తలు మెడి సారథి పేరుతో ఓ డ్రోన్‌ను, ట్రాలీని రూపొందించారు. హై రిస్క్ వార్డుల్లో చికిత్స అందించే క్రమంలో వైద్యులకు, మెడికల్ సిబ్బందికి ఉపయోగపడేలా దీన్ని ...

హై రిస్క్ కరోనా వార్డుల్లో చికిత్స కోసం మెడి-సారథి

చండీగఢ్: కరోనా వేళ పంజాబ్ ఐఐటీ శాస్త్రవేత్తలు మెడి సారథి పేరుతో ఓ డ్రోన్‌ను, ట్రాలీని రూపొందించారు. హై రిస్క్ వార్డుల్లో చికిత్స అందించే క్రమంలో వైద్యులకు, మెడికల్ సిబ్బందికి ఉపయోగపడేలా దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో తయారుచేశారు. రోపర్ ఐఐటీ శాస్త్రవేత్తలు, పరిశోధకులు చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ సంస్థ వైద్యులు కలిసి దీన్ని రూపొందించారు. 


కోవిడ్ వార్డుల్లో సేవలందించేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా భౌతిక దూరం పాటిస్తూ బాధితులకు సేవలందించేలా దీన్ని రూపొందించారు. పూర్తి స్థాయిలో రిమోట్‌తో పనిచేసే మెడి సారథిలో కెమెరాలున్నాయి. పేషంట్ల టెంపరేచర్ రికార్డ్ చేయగలదు. మందులు, శానిటైజర్లను తీసుకెళ్లే సామర్ధ్యం కూడా ఉంది. కరోనా విజృంభిస్తున్న వేళ మెడి సారథి ఆవిష్కారం వైద్యరంగంలో సానుకూల మార్పులకు నాంది పలుకుతుందని వైద్యాధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2020-07-09T01:39:01+05:30 IST