ఫ్లోర్ క్లీనింగ్ కోసం ఐఐటీ గువాహటి అద్భుత పరికరం

ABN , First Publish Date - 2020-04-08T02:47:37+05:30 IST

దేశంలో అంతకంతకూ విస్తరిస్తున్న కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఉన్న ఏకైక మందు భౌతిక దూరం

ఫ్లోర్ క్లీనింగ్ కోసం ఐఐటీ గువాహటి అద్భుత పరికరం

గువాహటి: దేశంలో అంతకంతకూ విస్తరిస్తున్న కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఉన్న ఏకైక మందు భౌతిక దూరం పాటించడం, పరిశుభ్రత. ఈ రెండింటిని పాటిస్తే ఈ ప్రాణాంతక వైరస్ నుంచి దూరంగా ఉండొచ్చు. ఈ రెండు సరే. మరి నీరు వంటి ద్రవ పదార్థాలతో శుభ్రం చేయలేని ఫ్లోర్ల సంగతేంటి? వాటినెలా శానిటైజ్ చేయాలి? ఈ ప్రశ్నకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గువాహటి (ఐఐటీ-జి) చక్కని పరిష్కారం చూపింది. యూవీసీ లెడ్ ఆధారిత పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఇది ఇళ్లు, ఆసుపత్రులు, బస్సులు తదితర వాటి ఫ్లోర్లను పూర్తిగా శానిటైజ్ చేసేస్తుంది. ద్రవపదార్థాలతో శుభ్రం చేయలేని ఉపరితలాలను శుభ్రపరిచే సాంకేతిక పరిజ్ఞానమే యూవీసీ. ఇది 90 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని, సూక్షజీవులను పూర్తిగా నిర్మూలిస్తుందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్  సెంథిల్ మురుగన్ సుబ్బయ్య తెలిపారు. ఈ పరికరాన్ని వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు కేవలం వెయ్యిరూపాయలకే లభించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-08T02:47:37+05:30 IST