ఇరుకు వీధుల్లో వేగంగా నడిస్తే.. కరోనా వెంబడిస్తుంది!!

ABN , First Publish Date - 2020-12-17T07:50:28+05:30 IST

ఇరుకు మార్గాల్లో మీరు వేగంగా నడుస్తారా? అయితే కరోనా వైరస్‌ వెంబడిస్తుంది తస్మాత్‌ జాగ్రత్త!! ఇరుకు తోవల్లో కరోనా వ్యాప్తి ముప్పు పెరుగుతుందని బీజింగ్‌లోని చైనీస్‌ అకాడమీ

ఇరుకు వీధుల్లో వేగంగా నడిస్తే.. కరోనా వెంబడిస్తుంది!!

చైనా శాస్త్రవేత్తల అధ్యయన నివేదిక 

బీజింగ్‌, డిసెంబరు 16 : ఇరుకు మార్గాల్లో మీరు వేగంగా నడుస్తారా? అయితే కరోనా వైరస్‌ వెంబడిస్తుంది తస్మాత్‌ జాగ్రత్త!! ఇరుకు తోవల్లో కరోనా వ్యాప్తి ముప్పు పెరుగుతుందని బీజింగ్‌లోని చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.


ఇరుకు మార్గాల్లో ఎవరైనా కరోనా రోగి దగ్గినా, తుమ్మినా వెలువడే నీటి తుంపరలు.. ఆ రోగి నడుమంత ఎత్తులో వెనుక వైపుగా ప్రయాణిస్తాయని కంప్యూటర్‌ సిమ్యులేషన్‌ అధ్యయనంలో గుర్తించినట్లు వెల్లడించారు. ఈ సమయంలో ఆ రోగి వెనుక పిల్లలు ఉంటే ఇన్ఫెక్షన్‌ బారినపడాల్సి రావచ్చన్నారు.

విశాలమైన దారుల్లో గాలి ప్రసరించే వేగం ఎక్కువగా ఉండటంతో.. రోగి దగ్గు/తుమ్ము నుంచి వెలువడే నీటితుంపరలు వెంటనే చెల్లాచెదురై నడుముకు దిగువనే వెనుక వైపుగా ప్రయాణించి త్వరగా పతనమవుతాయని చెప్పారు. 


Updated Date - 2020-12-17T07:50:28+05:30 IST