అప్పుడే లాక్‌డౌన్లు వచ్చుంటే నా పరిస్థితి ఏమయ్యేదో.. : సచిన్ బన్సాల్

ABN , First Publish Date - 2020-05-14T01:39:25+05:30 IST

కొవిడ్-19 కారణంగా ఇప్పుడు అమలు చేస్తున్న లాక్‌డౌన్లు తన చిన్నతనంలో వచ్చి ఉంటే తాను పేదరికంలోనే...

అప్పుడే లాక్‌డౌన్లు వచ్చుంటే నా పరిస్థితి ఏమయ్యేదో.. : సచిన్ బన్సాల్

న్యూఢిల్లీ: కొవిడ్-19 కారణంగా ఇప్పుడు అమలు చేస్తున్న లాక్‌డౌన్లు తన చిన్నతనంలో వచ్చి ఉంటే తాను పేదరికంలోనే పెరగాల్సి వచ్చేదని ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ పేర్కొన్నారు. అప్పట్లో తన తండ్రి చేపట్టిన చిన్నపాటి వ్యాపారాలు కచ్చితంగా మూతపడేవని గుర్తుచేసుకున్నారు. ఇవాళ ట్విటర్ వేదికగా బన్సాల్ స్పందిస్తూ.. ‘‘నా చిన్నతనంలో కొవిడ్-19 లాక్‌డౌన్లు వచ్చుంటే.. నా తండ్రి చేపట్టిన చిన్న వ్యాపారాలు మూతపడేవి. అదే జరిగితే నేను మధ్యతరగతి కుటుంబంలో బదులు అత్యంత పేదరికంలో పెరగాల్సి వచ్చేది. అలాంటి అనుకూల వాతావరణమే లేకుంటే ఇవాళ నేను చేసినవాటిలో ఒక్కటి కూడా సాధించలేకపోయేవాడిని. ఇవాళ లక్షలాది మంది పిల్లలకు జరుగుతున్నది ఇదే...’’ అని పేర్కొన్నారు. కాగా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ దేశ భవిష్యత్తును నిర్ధేశించారనీ.. తదనుగుణంగా పనిచేసి, స్వావలంబన భారత్ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ఆయన మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. Read more