నేను అలా కనిపిస్తే ఆత్మహత్యతో మరణించలేదని గుర్తుంచుకోండి: పాయల్ ఘోష్

ABN , First Publish Date - 2020-09-25T01:02:22+05:30 IST

నేను అలా కనిపిస్తే ఆత్మహత్యతో మరణించలేదని గుర్తుంచుకోండి: పాయల్ ఘోష్

నేను అలా కనిపిస్తే ఆత్మహత్యతో మరణించలేదని గుర్తుంచుకోండి: పాయల్ ఘోష్

ముంబై: నేను పైకప్పు నుంచి వేలాడుతున్నట్లు కనిపిస్తే, నేను ఆత్మహత్యతో మరణించలేదని గుర్తుంచుకోవాలని నటి పాయల్ ఘోష్ తెలిపింది. చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నటి పాయల్ ఘోష్, ఈ విషయానికి సంబంధించి తాను ఇటీవల  "ప్రఖ్యాత పోర్టల్"కు ఇంటర్వ్యూ ఇచ్చానని ఆమె పేర్కొంది. అయితే పోర్టల్ కశ్యప్ అనుమతి కోరుతున్నట్లు తెలిసిందని అన్నారు. 


బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన ప్రముఖ నటి పాయల్ ఘోష్.. ఆయనపై అత్యాచారం కేసు పెట్టారు. నిందితుడిపై ఎట్టకేలకు కేసు నమోదైంది. అత్యాచారం, దురుద్దేశంతో మహిళను నిర్బంధించి వారి గౌరవానికి భంగం కలిగించడంపై ఐపీసీలోని 376(1), 354, 341, 342 సహా పలు సెక్షన్లపై ఎఫ్ఐఆర్ దాఖలైందని ఆమె తరపు న్యాయవాది తెలిపారు.


తనపై పాయల్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అనురాగ్ పేర్కొన్నారు. ఈ విషయంలో మౌనంగా ఉండాలని తన న్యాయవాది సలహా ఇచ్చినట్టు ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాగా అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఈ నెల 19న పాయల్ చేసిన ఆరోపణలు బాలీవుడ్‌లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. కశ్యప్‌పై చర్యలు తీసుకోవాలంటూ ప్రధానమంత్రిని సైతం ఆమె ట్విటర్ వేదికగా అభ్యర్థించారు. 

Updated Date - 2020-09-25T01:02:22+05:30 IST