అందరూ ఇంట్లోనే ఉంటే... కరోనా కేసులు తగ్గుతాయట!

ABN , First Publish Date - 2020-03-24T14:51:17+05:30 IST

కరోనా వైరస్ ప్రపంచమంతటా మరింతగా విస్తరిస్తోంది. మన దేశంలోనూ కరోనా సంక్రమిత కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో దేశంలోని మొత్తం 548 జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటించారు. ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రాకూడదని కేంద్ర ప్రభుత్వం ...

అందరూ ఇంట్లోనే ఉంటే... కరోనా కేసులు తగ్గుతాయట!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచమంతటా మరింతగా విస్తరిస్తోంది. మన దేశంలోనూ కరోనా సంక్రమిత కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో దేశంలోని మొత్తం 548 జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటించారు. ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రాకూడదని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇండియన్  కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) చేసిన అధ్యయనం ప్రకారం దేశంలోని ప్రజలు ఇళ్లకే పరిమితమై ఉంటే కరోనా కేసులు అత్యధికంగా తగ్గుముఖం పడతాయని వెల్లడయ్యింది. కాగా భారత్‌లో ప్రస్తుతం కరోనా వైరస్ స్టేజ్-2కు చేరుకుని, స్టేజ్-3 దిశగా కదులుతోంది. ఈ దశలో వైరస్ కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతుంది. ఇదేగానీ జరిగితే పరిస్థితి మరింత తీవ్ర తరమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రజలంతా ఇళ్లకే పరిమితమై ఉండాలని వారు సూచిస్తున్నారు.

Updated Date - 2020-03-24T14:51:17+05:30 IST