వ్యాక్సిన్లపై సమాచారంతో ఐసీఎంఆర్ ప్రత్యేక పోర్టల్ త్వరలో
ABN , First Publish Date - 2020-08-23T03:46:46+05:30 IST
భారత దేశంలో వివిధ వ్యాధుల నిరోధక వ్యాక్సిన్లకు సంబంధించిన మొత్తం సమాచారంతో కూడిన
న్యూఢిల్లీ : భారత దేశంలో వివిధ వ్యాధుల నిరోధక వ్యాక్సిన్లకు సంబంధించిన మొత్తం సమాచారంతో కూడిన పోర్టల్‌ను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అభివృద్ధిపరుస్తోంది. దీనిని వచ్చే వారానికి ప్రజలకు అందుబాటులోకి తెస్తారు. మన దేశంలో ఇటువంటి పోర్టల్ అందుబాటులోకి రావడం ఇదే మొదటిసారి అవుతుంది.
ఐసీఎంఆర్ శాస్త్రవేత్త డాక్టర్ సమీరన్ పాండా మాట్లాడుతూ, భారత దేశంలో వ్యాక్సిన్లకు సంబంధించిన యావత్తు సమాచారాన్ని ప్రజలు ఒకే చోట పొందవచ్చునని తెలిపారు. డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు తాము ఐసీఎంఆర్ వ్యాక్సిన్ పోర్టల్‌ను అభివృద్ధి పరుస్తున్నామన్నారు. మొదట్లో ఈ వెబ్‌సైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ సమాచారం అందుబాటులో ఉంటుందని చెప్పారు. క్రమంగా ఇతర వ్యాధుల నిరోధక వ్యాక్సిన్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రచురిస్తామని చెప్పారు. ఐసీఎంఆర్ అనేది బయోమెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అని తెలిపారు.