‘అనుమానాస్పద విత్తనాల’పై సమాచారం సేకరిస్తున్నాం: ఐసీఏఆర్‌

ABN , First Publish Date - 2020-08-11T08:01:08+05:30 IST

అనుమానాస్పద విత్తన పార్శిళ్లపై అంతర్జాతీయ పరిశోధనా సంస్థల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) తెలిపింది. అమెరికా, ఇతర దేశాల్లో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రైతుల ఇళ్లకు...

‘అనుమానాస్పద విత్తనాల’పై సమాచారం సేకరిస్తున్నాం: ఐసీఏఆర్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 10: అనుమానాస్పద విత్తన పార్శిళ్లపై అంతర్జాతీయ పరిశోధనా సంస్థల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) తెలిపింది. అమెరికా, ఇతర దేశాల్లో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రైతుల ఇళ్లకు వస్తున్న విత్తన పార్శిళ్లపై ఆరా తీస్తున్నట్లు ఐసీఏఆర్‌ సోమవారం వెల్లడించింది. ‘‘ఇది చాలా తీవ్రమైన అంశం. విత్తనాలంటే వ్యవసాయం. అలాంటి విత్తనాల్లో వ్యాధికారక రసాయనాలు ఏమైనా ఉంటే మన ఆహార భద్రతకే పెనుముప్పుగా పరిణమిస్తాయి. కాబట్టి మనం వీటిపై తప్పనిసరిగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని ఐసీఏఆర్‌ డీజీ త్రిలోచన్‌ మహాపాత్ర చెప్పారు. ఇలాంటి విత్తన పార్శిళ్లపై అప్రమత్తంగా ఉండాలని గత వారమే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను హెచ్చరించిన విషయం తెలిసిందే 


Updated Date - 2020-08-11T08:01:08+05:30 IST