ట్రంప్ ఆ పని చేయడం బాధించింది: సుందర్ పిచాయ్

ABN , First Publish Date - 2020-06-23T21:40:05+05:30 IST

హెచ్-1బీ, ఎల్-1 వీసాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాత్కాలికంగా నిషేధం విధించిన విషయం...

ట్రంప్ ఆ పని చేయడం బాధించింది: సుందర్ పిచాయ్

వాషింగ్టన్: హెచ్-1బీ, ఎల్-1 వీసాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాత్కాలికంగా నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయంపై ఆల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. గొప్ప నైపుణ్యం గల ఉద్యోగులకే హెచ్-1బీ వీసా ఇస్తారని, అలాంటి వారిని కూడా నిషేధించడం సబబు కాదని హితవు పలికారు.  ‘అమెరికా ఆర్థిక రంగంలో విదేశీయుల పాత్ర ఎంతో ఉందని, టెక్నీలజీలో ప్రపంచంలోనే అమెరికాను అగ్రగామని చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న గూగుల్ ఈ స్థాయికి చేరడంలో కూడా విదేశీయుల పాత్ర ఎంతో కీలకమని, రాబోయే కాలంలో కూడా తాము వలస ఉద్యోగులకు అండగానే ఉంటామని పిచాయ్ తెలిపారు.

Read more