పంజాబ్‌‌లో కూలిన ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్

ABN , First Publish Date - 2020-05-08T18:05:29+05:30 IST

చండీఘర్: పంజాబ్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయింది.

పంజాబ్‌‌లో కూలిన ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్

చండీఘర్: పంజాబ్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయింది. ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఘటన హోషియార్‌పూర్ జిల్లాలో జరిగింది. రోజువారీ శిక్షణలో భాగంగా జలంధర్ నుంచి బయలుదేరిన కాసేపటికే మిగ్-29 విమానం కుప్పకూలిందని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాలే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. 

 

 

Updated Date - 2020-05-08T18:05:29+05:30 IST