రోగనిరోధక శక్తి ఉంటే కరోనా నుంచి కోలుకోవచ్చు...

ABN , First Publish Date - 2020-04-15T18:09:47+05:30 IST

రోగనిరోధక శక్తి ఉంటే నామమాత్రపు మందులతోనే కరోనా వైరస్ బారినుంచి బయటపడవచ్చని ...

రోగనిరోధక శక్తి ఉంటే కరోనా నుంచి కోలుకోవచ్చు...

కోల్‌కతా (పశ్చిమబెంగాల్): రోగనిరోధక శక్తి ఉంటే నామమాత్రపు మందులతోనే కరోనా వైరస్ బారినుంచి బయటపడవచ్చని కోల్ కతా నగరానికి చెందిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఛటర్జీ చెప్పారు. కరోనా బారి నుంచి బయటపడి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఛటర్జీ మీడియాతో మాట్లాడారు. కరోనా ప్రబలిన కష్టసమయంలో తనకు చికిత్స చేసిన వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ఛటర్జీ కృతజ్ఞతలు తెలిపారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ముఖ్యంగా వృద్ధులు కరోనా బారిన పడుతున్నరని, ఈ వైరస్ గురించి భయపడాల్సిన పనిలేదని చెప్పారు. తనకు రెండుసార్లు పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చాక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారని ఆయన పేర్కొన్నారు. తాను నిర్భంధ సమయంలో ఫోన్ లో స్నేహితులు, కుటుంబసభ్యులతో మాట్లాడుతూ, ఇంటర్ నెట్ బ్రౌజింగ్ చేస్తూ కాలం గడిపానని ఛటర్జీ వివరించారు. తనకు జ్వరం, తుమ్ములు, దగ్గు లేకపోయినా కరోనా పాజిటివ్ అని వచ్చిందని చెప్పారు. 

Updated Date - 2020-04-15T18:09:47+05:30 IST