గొడ్డు మాంసం తింటా.. అడగడానికి మీరెవరయ్యా? : మాజీ సీఎం

ABN , First Publish Date - 2020-12-30T16:28:31+05:30 IST

‘అవును.. నేను గొడ్డు మాంసం తింటా. అసెంబ్లీలోనే

గొడ్డు మాంసం తింటా.. అడగడానికి మీరెవరయ్యా? : మాజీ సీఎం

బెంగళూరు : ‘అవును.. నేను గొడ్డు మాంసం తింటా. అసెంబ్లీలోనే ఈ విషయం పలుమార్లు చెప్పా   . ఇది నా ఆహారపు అలవాటు. అడగడానికి మీరెవరయ్యా’ అంటూ కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య ఓ కాంగ్రెస్‌ కార్యకర్తపై మండిపడ్డ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ‘ఇష్టం ఉంటే మీరూ తినండి. లేదా వదిలేయండి. నేనేం బలవంతం చేయను. నా ఆహారం నా హక్కు. అడగడానికి మీరెవరు’ అంటూ సిద్దూ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రీ-ట్వీట్‌ చేసింది. ‘కాంగ్రెస్‌ను రాష్ట్రంలో సర్వనాశనం చేసేందుకు మీరొక్కరు చాలు. ధన్యవాదాలు’ అంటూ బీజేపీ ట్యాగ్‌ పెట్టింది.


ఆదివారం హనుమద్‌వ్రతం కావడంతో మాసం తినడం సరైనదేనా అంటూ కాంగ్రెస్‌ కార్యకర్త ప్రశ్నించడంపై సిద్దూ పై విధంగా నిప్పులు చెరిగారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లౌకికధర్మమా? అని సిద్దూను ప్రశ్నించారు. ‘ఆయన ఏ మాంసం తిన్నా మాకు అనవసరం. హనుమంతుడు ఈ రోజే పుట్టాడా? అంటూ హిందువుల భావాలను దెబ్బతీస్తే మాత్రం సహించేది లేదు’ అంటూ బీజేపీ నేతలు హెచ్చరించారు.

Updated Date - 2020-12-30T16:28:31+05:30 IST