‘హైడ్రాక్సీ’తో గుండెకు ఇలా ముప్పు..

ABN , First Publish Date - 2020-06-03T07:28:15+05:30 IST

కరోనా చికిత్సకు మలేరియా నిరోధక ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వాడితే గుండెపోటు సంభవించే అవకాశాలు ఉంటాయని అమెరికాలోని జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు...

‘హైడ్రాక్సీ’తో గుండెకు ఇలా ముప్పు..

హ్యూస్టన్‌, జూన్‌ 2 : కరోనా చికిత్సకు మలేరియా నిరోధక ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వాడితే గుండెపోటు సంభవించే అవకాశాలు ఉంటాయని అమెరికాలోని జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. జంతువులపై జరిపిన ప్రయోగ పరీక్షల్లో ఆప్టికల్‌ మ్యాపింగ్‌ పరిజ్ఞానంతో సచిత్రంగా ఈవిషయాన్ని గుర్తించినట్లు వారు వెల్లడించారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ డోసును అందించిన జంతువుల్లో గుండె కొట్టుకునే రేటు ఒక్కసారిగా పెరిగి.. హృదయం నుంచి శరీర భాగాలకు జరిగే రక్త పంపిణీకి ఆటంకం కలిగిందన్నారు. ఈక్రమంలో గుండె కొట్టుకోవడాన్ని నియంత్రించే ‘టీ వేవ్‌’ అనే ఎలక్ట్రికల్‌ సిగ్నళ్లు గాడి తప్పి గుండెపోటు రావచ్చని తెలిపారు. 


Updated Date - 2020-06-03T07:28:15+05:30 IST