కేటీఆర్ ఆదేశం...హైదరాబాద్ మెట్రోరైలు పరిశుభ్రం

ABN , First Publish Date - 2020-03-04T17:54:48+05:30 IST

హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ బాధితుడిని గుర్తించిన నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోరైలు అధికారులు అప్రమత్తమయ్యారు.....

కేటీఆర్ ఆదేశం...హైదరాబాద్ మెట్రోరైలు పరిశుభ్రం

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ బాధితుడిని గుర్తించిన నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోరైలు అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశంతో తక్షణం కదిలిన హైదరాబాద్ మెట్రోరైలు అధికారులు సబ్బులతో మెట్రోరైలు బోగీలను కడిగి శుభ్రం చేశారు. మెట్రో సిబ్బంది రంగంలోకి దిగి మెట్రోరైలు లోపల ఉన్న బెంచీలు, హ్యాండిల్స్, ద్వారాలను నీటితో కడిగి శుభ్రం చేశారు.కరోనా వైరస్ నేపథ్యంలో మెట్రో, ఆర్టీసీ అధికారులకు సైతం ట్విట్టర్ వేదికగా సూచనలు చేశారు. ‘‘బెంగుళూరు తరహాలో సత్వరమే చర్యలను చేపట్టాలని హైదరాబాద్ మెట్రో రైల్, ఎల్అండ్‌టీ ఎండీలను అభ్యర్థిస్తున్నా. అలాగే ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్ గారు టీఎస్‌ఆర్టీసీలో సైతం చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నా’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-03-04T17:54:48+05:30 IST