‘కరోనా’కు హైదరాబాద్ మందు..!

ABN , First Publish Date - 2020-03-19T02:05:25+05:30 IST

‘కోవిడ్-19(కరోనా)’కు యాంటీ డాట్‌ను కొనుగొనేందుకు అమెరికా, చైనా, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు యత్నిస్తున్నాయి. ఇక మనదేశంలోనూ కరోనా మందు కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. అది కూడా మన హైదరాబాద్‌లోనే. దీనిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ)’, సిప్లా కంపెనీ... కరోనా వైరస్‌కు విరుగుడు మందులను తయారు చేసేందుకు చేతులు కలిపాయి.

‘కరోనా’కు హైదరాబాద్ మందు..!

హైదరాబాద్ : ‘కోవిడ్-19(కరోనా)’కు  యాంటీ డాట్‌ను కొనుగొనేందుకు అమెరికా, చైనా, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు యత్నిస్తున్నాయి. ఇక మనదేశంలోనూ కరోనా మందు కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. అది కూడా మన హైదరాబాద్‌లోనే. దీనిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ)’, సిప్లా కంపెనీ...  కరోనా వైరస్‌కు విరుగుడు మందులను తయారు చేసేందుకు చేతులు కలిపాయి.


ఫెవిపిరవిర్‌, రెమిడెస్‌విర్, బెలాక్సివిర్...  కరోనాకు విరుగుడుగా పనిచేయగలవని ఐఐసీటీ, సిప్లా సంస్థలు ఇప్పటికే ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ మూడు రసాయనాలు... వైరస్‌లను నిరోధించేందుకు సమర్థంగా ఉపయోగపడతాయని ఐఐసీటీ శాస్త్రవేత్తలు  గుర్తించారు. అయితే... వీటిని పారిశ్రామిక స్థాయిలో తయారు చేసి ఇస్తే తాము టాబ్లెట్లు, ఇంజెక్షన్లు తయారు చేసి అందుబాటులోకి తెస్తామని సిప్లా కంపెనీ ప్రతిపాదించింది. ఆయా డ్రగ్స్‌పై క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తయ్యాయని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. 


అయితే వేర్వేరు కారణాల వల్ల ఇవి మార్కెట్‌లోకి రాలేదని, అయితే... అత్యవసర పరిస్థితుల్లో నేరుగా ఉపయోగించే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఇక సిప్లా అధినేత డాక్టర్‌ హమీద్‌ ఐఐసీటీకి మెయిల్‌ పంపించారు. ఈ మూడు మందులను ఎలాంటి షరతుల్లేకుండా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 


ఈ నేపథ్యంలో రెమిడిస్‌విర్, ఫెవిపిరవిర్‌ మందులను కావాల్సినంత మోతాదులో తయారు చేసి సిప్లాకు అందిస్తామని ఐఐసీటీ డైరెక్టర్ చెప్పారు. అనంతరం ప్రభుత్వ అనుమతులతో వీలైనంత వేగంగా వాటిని అందుబాటులోకి తీసుకురావచ్చని వెల్లడించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆరు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తై... కరోనాకు ‘జనరిక్’ మందు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశముందని తెలిపారు. 


Updated Date - 2020-03-19T02:05:25+05:30 IST