భర్త, పిల్లలు మాట్లాడలేదని మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-09-14T16:30:10+05:30 IST

భర్త, పిల్లలు మాట్లాడకపోవడంతో మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదాన్ని నింపింది. గౌండరపాళయం దక్షిణ కొండ దిగువ ప్రాంతంలో నివసిస్తున్న

భర్త, పిల్లలు మాట్లాడలేదని మహిళ ఆత్మహత్య

చెన్నై : భర్త, పిల్లలు మాట్లాడకపోవడంతో మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదాన్ని నింపింది. గౌండరపాళయం దక్షిణ కొండ దిగువ ప్రాంతంలో నివసిస్తున్న ఎట్టియన్నన్‌, తమిళ్‌సెల్వి (43) దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలంగా భర్త, పిల్లలు తమిళ్‌సెల్వితో మాట్లాడకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపంతో ఉండేది. ఈనెల 10న ఇంటి నుంచి బయటకెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. ఆమె కోసం బంధువులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. ఈ విషయమై ఎట్టిముత్తు సెంగవల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో, ఆదివారం సాయంత్రం పైత్తనూర్‌ వైత్తుమలై ప్రాంతంలోని ఓ చెట్టుకు మహిళ ఉరేసుకొని ఉండడం గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-09-14T16:30:10+05:30 IST