కొవిడ్ నిబంధనల ఉల్లంఘన...చెన్నైలో కుమరన్ సిల్కుకు సీలు
ABN , First Publish Date - 2020-10-21T11:52:55+05:30 IST
కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన చెన్నైలోని కుమరన్ సిల్కుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు....

చెన్నై(తమిళనాడు): కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన చెన్నైలోని కుమరన్ సిల్కుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీలు వేశారు. దసరా పండుగకు ముందే బహుళ అంతస్తుల షోరూమ్ అయిన కుమరన్ సిల్కులో పెద్ద ఎత్తున జనం గుమిగూడిన వీడియోలు సోషల్ మీడియాలో వెలుగుచూశాయి. చెన్నైలోని టీనగర్ లో ఉన్న కుమరన్ సిల్కు షాపులో కొవిడ్-19 నిబంధనలు పాటించనందువల్ల మూసివేశామని చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పారు.
కొవిడ్ నిబంధనలు పాటించని ఇతర దుకాణాలను కూడా మూసివేస్తామని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ట్వీట్‌లో హెచ్చరించింది. షోరూమ్ లో చాలామంది ప్రజలు ఫేస్ మాస్కులు ధరించలేదు. షోరూంలోఎక్కువమంది వినియోగదారులను అనుమతించవద్దని చెన్నై కమిషనర్ జి. ప్రకాష్ చెప్పారు.జనం రద్దీని నియంత్రించడంతో శానిటైజర్లు, ఫేస్ మాస్కులు పెట్టడంతోపాటు సామాజిక దూరం పాటించాలని కోరారు.