జీవించే హక్కును హరిస్తారా?

ABN , First Publish Date - 2020-05-08T08:40:19+05:30 IST

విశాఖ ఘటనపై కేంద్ర మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) స్పందించింది. ఈ ప్రమాదం గురించి మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న సంఘం...

జీవించే హక్కును హరిస్తారా?

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

న్యూఢిల్లీ, మే 7(ఆంధ్రజ్యోతి): విశాఖ ఘటనపై కేంద్ర మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) స్పందించింది. ఈ ప్రమాదం గురించి మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న సంఘం... నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదికలు సమర్పించాలని కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ‘అసలే కరోనా విజృంభిస్తుండడంతో రోజువారీ కార్యక్రమాలకే ఇబ్బందిపడుతున్న ప్రజలకు ఇది పిడుగుపాటులా మారింది. ఈ ప్రమాదంలో బాధితులుగా మారిన ప్రజల జీవించే హక్కు తీవ్ర ఉల్లంఘనకు గురైంది’ అని ఎన్‌హెచ్‌ఆర్సీ పేర్కొంది. సహాయక చర్యలు, అనారోగ్యానికి గురైన వారికి అందిస్తున్న చికిత్స, బాధిత కుటుంబాలకు సహాయం, పునరావాసం తదితర అంశాలతో కూడిన సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జారీ చేసిన నోటీసులో పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు, దర్యాప్తునకు సంబంధించిన వివరాలను తెలియచేయాలని డీజీపీకి స్పష్టం చేసింది. కంపెనీలోచట్టం మేరకు కార్యకలాపాలు జరుగుతున్నాయో లేదో పరిశీలించి నివేదిక ఇవ్వాలని కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖను ఆదేశించింది. 

Updated Date - 2020-05-08T08:40:19+05:30 IST