సుప్రీం కోర్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మానవ హక్కుల కార్యకర్త

ABN , First Publish Date - 2020-03-04T21:46:26+05:30 IST

అయోధ్య, ఎన్‌ఆర్సీ, కశ్మీర్ అంశాలలో సుప్రీం కోర్టు విఫలమైందని, ఇప్పుడు రోడ్డుపై ఉద్యమాల ద్వారా దేశ భవిష్యత్తుని నిర్ణయించే...

సుప్రీం కోర్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మానవ హక్కుల కార్యకర్త

అయోధ్య, ఎన్‌ఆర్సీ, కశ్మీర్ అంశాలలో సుప్రీం కోర్టు విఫలమైందని, ఇప్పుడు రోడ్డుపై ఉద్యమాల ద్వారా దేశ భవిష్యత్తుని నిర్ణయించే సమయం వచ్చిందని ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త హర్ష్ మందర్ అన్నారు. 



ఢిల్లీలోని జామియా యూనివర్సిటీ బయట విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో హర్ష్ మందర్ మాట్లాడుతూ ‘‘అయోధ్య తీర్పులో సుప్రీం కోర్టు సెక్యులరిజాన్ని(లౌకికవాదాన్ని)  కాపాడలేదు. ఇప్పుడు పార్టమెంటు, సుప్రీం కోర్టుపై నమ్ముకొని లాభంలేదు. అయోధ్య, ఎన్‌ఆర్సీ, కశ్మీర్ అంశాలలో సుప్రీం కోర్టు ఎలా వ్యవహరించిందో మనం చూశాం. మానవత్వం, సమానత్వం, సెకులరిజం వంటి వాటిని సుప్రీం కోర్టు పట్టించుకోవడం లేదు. కోర్టులలో మనం పోరాటం సాగిస్తాం కాని పార్లమెంటులో లేదా సుప్రీం కోర్టులో సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు అందుకే రోడ్డుపై ఉద్యమాల ద్వారా దేశ భవిషత్తుని మనం కాపాడుకోవాలి’’ అని అన్నారు.


ఇంతకుముందు హర్ష్ మందర్ సోమవారం ఢిల్లీలో అల్లర్లపై కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఢిల్లీలో జరిగిన హింసాకాండలో బాధితులకు సరైన వైద్య సహాయం, భద్రత కానీ అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలలో కనీసం ఒక ఆస్పత్రి కూడా లేదని ఎత్తిచూపారు. అల్లర్లు ప్రేరేపించేవిధంగా ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ హై కోర్టులో ఆయన పిటీషన్ కూడా వేశారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు కూడా బుధవారం కేంద్ర ప్రభుత్వంపై అనురాగ్ ఠాకుర్, కపిల్ మిశ్రా, పర్వేశ్ వర్మ లాంటి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఒత్తిడి చేసింది.

Updated Date - 2020-03-04T21:46:26+05:30 IST