మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరు మార్పు
ABN , First Publish Date - 2020-07-29T20:05:10+05:30 IST
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరు మారుస్తున్నట్టు సమాచారం. విద్యాశాఖగా మార్చనున్నారని తెలుస్తోంది.
న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరు మారుస్తున్నట్టు సమాచారం. విద్యాశాఖగా మార్చనున్నారని తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం దీనిపై పూర్తి ప్రకటన చేసే అవకావం ఉంది. కేంద్ర కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ శాఖకు ప్రస్తుతం రమేశ్ పోక్రియాల్ నేతృత్వం వహిస్తున్నారు. నూతన విద్యా విధానం తీసుకు వస్తున్న నేపథ్యంలో పేరు మార్పు చర్చనీయాంశంగా మారింది. సాయంత్రం ప్రధానమంత్రి నివాసంలో జరగనున్న భేటీలో కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకరర్, రమేశ్ పోక్రియాల్ పూర్తి వివరాలు తెలపనున్నారు.