శవ దహనమా? మమ్మీల్లా పాతేయడమా?

ABN , First Publish Date - 2020-03-15T07:43:02+05:30 IST

కరోనా వైర్‌సతో చనిపోయేవారి అంత్యక్రియలు ఎలా జరపాలి? మృతదేహాలకూ.. వాటి నుంచి వెలువడే ప్రత్యేక ద్రవాల్లోనూ కరోనా ఉంటుంది. అలాంటప్పుడు వైరస్‌ ఇతరులకు సోకకుండా మృతదేహాలను దహనం చేయడమా?

శవ దహనమా? మమ్మీల్లా పాతేయడమా?

  • కరోనాతో చనిపోతే ఎలా?.. కేంద్రం మార్గదర్శకాలు!


న్యూఢిల్లీ, మార్చి 14: కరోనా వైర్‌సతో చనిపోయేవారి అంత్యక్రియలు ఎలా జరపాలి? మృతదేహాలకూ.. వాటి నుంచి వెలువడే ప్రత్యేక ద్రవాల్లోనూ కరోనా ఉంటుంది. అలాంటప్పుడు వైరస్‌ ఇతరులకు సోకకుండా మృతదేహాలను దహనం చేయడమా? లేక.. ఈజిప్టు మమ్మీలకు మాదిరిగా.. పటిష్ఠమైన భద్రత ఉండే బ్యాగులో మృతదేహాలను చుట్టేసి, పాతి పెట్టడమా? ఢిల్లీలో కరోనాతో మృతిచెందిన 68 ఏళ్ల మహిళ అంత్యక్రియల సందర్భంలో ఈ సందిగ్దం నెలకొన్న నేపథ్యంలో.. కేంద్రం మార్గదర్శకాల రూపకల్పనకు సిద్ధమైంది. వాటిలో కొన్ని.. కరోనాతో మృతిచెందిన వ్యక్తికి పోస్టుమార్టం నిర్వహించే వైద్యుడు, ఇతర సిబ్బంది బాధితులుగా మారే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో వారికి వాడిపారేసే ప్రొటెక్టివ్‌ గౌన్లు, గ్లౌస్‌, మాస్క్‌లు అందజేయాలి. వారు వాడే గౌన్లు నీటి నిరోధకాలు(వాటర్‌ప్రూఫ్‌) అయ్యి ఉండాలి. మృతదేహం నుంచి కారే ద్రవాల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందకుండా.. వాటిని ప్రత్యేక బ్యాగ్‌లలో చుట్టివేయాలి. శవాగారాల్లో (మార్చురీలు) కూడా మృతదేహం తాలూకు కరోనా వైరస్‌ సజీవంగా ఉండే ప్రమాదముంది. దీనిపైనా ప్రత్యేక దృష్టి సారించాలి. విద్యుత్తు, సీఎన్‌జీ (కాంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌) దహనవాటికల్లో అంత్యక్రియలు చేయడం మంచిదని కేంద్రం భావిస్తోంది. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సూచనలనూ కేంద్రం పరిగణనలోకి తీసుకుంటోంది. 

Updated Date - 2020-03-15T07:43:02+05:30 IST