మెహబూబా నిర్బంధ కాలాన్ని పొడగించడంపై చిదంబరం ఫైర్
ABN , First Publish Date - 2020-08-01T20:29:50+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధ కాలాన్ని కేంద్ర పొడగించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత

న్యూఢిల్లీ : మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధ కాలాన్ని కేంద్రం పొడగించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘గృహ నిర్బంధ పొడగింపు అనేది రాజ్యాంగం ప్రతి వ్యక్తికీ ఇచ్చిన హక్కులను హరించడమే. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయడమే. 24 గంటలూ భద్రతతోనే గడిపే వ్యక్తి... 61 ఏళ్ల నేత... ప్రజా భద్రతకు ఏవిధంగా విఘాతం కల్పిస్తారు? శరతులపై విడుదల చేస్తామన్న ప్రతిపాదనను ఆమె తిరస్కరించడం సబబే. ఆత్మ గౌరవం ఉన్న ప్రతి రాజకీయ నేత దానిని వ్యతిరేకిస్తాడు. ఆమె పార్టీ జెండా రంగును పరిగణనలోకి తీసుకొని నిర్బంధాన్ని పొడగించడం హాస్యాస్పదం’’ అని చిదంబరం ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని దుయ్యబట్టారు.
ప్రజాభద్రత చట్టం కింద మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధ కాలాన్ని మరో మూడు నెలలు ప్రభుత్వం పొడగించింది. ఆగస్టు 5న ఆమె గృహ నిర్బంధం నుంచి విముక్తురాలు కావాలి. అయితే కొన్ని కారణాలను చూపిస్తూ జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఆమె గృహ నిర్బంధ కాలాన్ని మరో మూడు నెలల వరకూ పొడగించింది.