మిజోరంలో భూకంపం.. ఇళ్లు ధ్వంసం

ABN , First Publish Date - 2020-06-23T06:53:44+05:30 IST

మిజోరంలో సోమవారం తెల్లవారుజామున 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. చం ఫాయీ జిల్లా జోఖావ్యర్‌ ప్రాం తంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు చెప్పారు...

మిజోరంలో భూకంపం.. ఇళ్లు ధ్వంసం

ఐజ్వాల్‌/న్యూఢిల్లీ, జూన్‌ 22: మిజోరంలో సోమవారం తెల్లవారుజామున 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. చం ఫాయీ జిల్లా జోఖావ్యర్‌ ప్రాం తంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఐజ్వాల్‌తో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. చంఫాయీ జిల్లాలో పలు ఇళ్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. రోడ్లపై పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రాణనష్టం సంభవించలేదని తెలిసింది.  


Read more