సమ్మతమంటూనే చురకలంటించిన శరద్ పవార్
ABN , First Publish Date - 2020-08-20T17:20:41+05:30 IST
నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసును సుప్రీం కోర్టు సీబీఐకి అప్పగించడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు.

ముంబై : నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసును సుప్రీం కోర్టు సీబీఐకి అప్పగించడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. సీబీఐకి పూర్తిగా సహకరిస్తామంటూనే ట్విట్టర్ వేదికగా చురకలంటించారు.
‘‘సీబీఐ దర్యాప్తు అపరిష్కృతంగానే మిగిలిపోతుందని నేను భావించడం లేదు. ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్ కేసును సీబీఐ 2014 లో ప్రారంభించింది. ఇంకా ముగియలేదు. దబోల్కర్ కేసు లాగా సుశాంత్ కేసు అవుతుందని భావించడం లేదు’’ అంటూ పరోక్షంగా సీబీఐకి చురకలంటించారు. సుశాంత్ కేసును సుప్రీం కోర్టు సీబీఐకి అప్పగించడాన్ని తాము గౌరవిస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం సీబీఐకి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని శరద్ పవార్ ప్రకటించారు.