ఆ 18 మంది ఉగ్రవాదులే : ప్రకటించిన కేంద్రం

ABN , First Publish Date - 2020-10-27T22:13:41+05:30 IST

చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేంద్ర హోంశాఖ మరో 18 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. హిజ్బుల్ ముజాయుద్దీన్

ఆ 18 మంది ఉగ్రవాదులే : ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ : చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేంద్ర హోంశాఖ మరో 18 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. హిజ్బుల్ ముజాయుద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్‌తో పాటు ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన భత్కల్ సోదరులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. 26/11 దాడులకు ముఖ్య కారకుడు సాజిద్ మీర్, యుసుఫ్ ముజమ్మిల్, (లష్కరే కమాండర్) అబ్దుర్ రహ్మాన్ మక్కి, ఇబ్రహీం అథార్, యూసుఫ్ హజర్, ఛోటా షకిల్ ఈ జాబితాలో ఉన్నారు. ‘‘జాతీయ భద్రతను బలోపేతం చేయడం, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే క్రమంలో మోదీ ప్రభుత్వం ఈ 18 మందిని చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (1967, 2019 లో సవరించిన) ప్రకారం ఉగ్రవాదులుగా ప్రకటిస్తోంది.’’ అని కేంద్ర హోంశాఖ మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. 


1. సాజిద్ మీర్ 2. యూసుఫ్ ముజమ్మిల్ 3. అబ్దుల్ రెహ్మాన్ మక్కి 4. షాహిద్ మొహ్మద్ 5. ఫర్హతుల్లా ఘోరీ 6. అబ్దుల్ రౌప్ అస్గర్ 7. ఇబ్రహీం అత్తర్ 8. యూసుఫ్ అజహర్ 9. షాహిద్ లతీఫ్ 10. సయ్యద్ మొహ్మద్ యూసుఫ్ షా 11. గులాంనబీ ఖాన్ 12. జాఫర్ హుస్సేన్ భట్ 13. రియాజ్ ఇస్మాయిల్ షాబాద్రి 14. మహ్మద్ ఇక్బాల్ 15. ఇబ్రహీం మీనన్ 16. మహ్మద్ అనిస్ షేక్ 17. ఛోటా షకీల్ 

Updated Date - 2020-10-27T22:13:41+05:30 IST