చారిత్రక సిటీ చౌక్ పేరు మార్పు... ఇకపై ఏమని పిలవాలంటే...
ABN , First Publish Date - 2020-03-02T13:21:33+05:30 IST
పాత జమ్మూలో ప్రముఖ వ్యాపారకేంద్రంగా నిలిచిన చారిత్రక సిటీ చౌక్ పేరును ‘భారత్ మాతా చౌక్’గా మార్చారు. బీజేపీ నేతృత్వంలో జరిగిన జమ్మూ మున్సిపల్ కార్పొరేషన్(జేఎంసీ) సమావేశంలో...

జమ్మూ: పాత జమ్మూలో ప్రముఖ వ్యాపారకేంద్రంగా నిలిచిన చారిత్రక సిటీ చౌక్ పేరును ‘భారత్ మాతా చౌక్’గా మార్చారు. బీజేపీ నేతృత్వంలో జరిగిన జమ్మూ మున్సిపల్ కార్పొరేషన్(జేఎంసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి సభ్యులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా నేత పూర్ణిమా శర్మ మాట్లాడుతూ తాను 4 నెలల క్రితం మున్సిపల్ సాధారణ సమావేశంలో సిటీ చౌక్ పేరు మార్పును ప్రస్తావించానని అన్నారు. దీనిని ‘భారత్ మాతా చౌక్’గా మార్చాలని కోరానన్నారు.