అపాచీకి దీటుగా ‘హాల్‌’ యుద్ధ హెలికాప్టర్లు!

ABN , First Publish Date - 2020-03-02T08:04:48+05:30 IST

సైనిక యుద్ధ హెలికాప్టర్లలో బోయింగ్‌కు చెందిన అపాచీ గార్డియన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. మధ్య స్థాయి మిలటరీ చాపర్స్‌లో...

అపాచీకి దీటుగా ‘హాల్‌’ యుద్ధ హెలికాప్టర్లు!

న్యూఢిల్లీ, మార్చి 1: సైనిక యుద్ధ హెలికాప్టర్లలో బోయింగ్‌కు చెందిన అపాచీ గార్డియన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. మధ్య స్థాయి మిలటరీ చాపర్స్‌లో ఇదే అత్యుత్తమం. అయితే దేశీయ పరిజ్ఞానంతోనే అపాచీకి దీటైన సామర్థ్యం కలిగిన హెలికాప్టర్లను తయారు చేసే మెగా ప్రాజెక్టుకు హాల్‌(హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌) శ్రీకారం చుట్టింది. ఎంఐ-17 చాపర్ల స్థానంలో 10-12 టన్నుల బరువుండే యుద్ధ హెలికాప్టర్లను తయారు చేయాలని లక్ష్యం గా పెట్టుకున్నట్టు హాల్‌ చైర్మన్‌, ఎండీ ఆర్‌.మాధవన్‌ తెలిపారు. రానున్న కాలంలో రూ.4 లక్షల కోట్ల విలువైన మిలటరీ హెలికాప్టర్ల దిగుమతిని ఆపడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు. హెలికాప్టర్ల ప్రాథమిక డిజైన్‌ను హాల్‌ ఇప్పటికే పూర్తి చేసిందని, ప్రభుత్వం ఈ ఏడాదే గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే 500 యూనిట్లు ఉత్పత్తి చేస్తామని మాధవన్‌ తెలిపారు. 

Updated Date - 2020-03-02T08:04:48+05:30 IST