పాక్‌లో హిందూ ఆలయం ధ్వంసం

ABN , First Publish Date - 2020-10-12T08:28:55+05:30 IST

పాకిస్థాన్‌లో ఓ దుండగుడు హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. సింధ్‌ ప్రావిన్స్‌లోని బదిన్‌ జిల్లాలో ఈ అతడు ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆలయంలోని విగ్రహాలను అతడు ధ్వంసం చేసి పారిపోయాడని అశోక్‌ కుమార్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు...

పాక్‌లో హిందూ ఆలయం ధ్వంసం

ఇస్లామాబాద్‌, అక్టోబరు 11: పాకిస్థాన్‌లో ఓ దుండగుడు హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. సింధ్‌ ప్రావిన్స్‌లోని బదిన్‌ జిల్లాలో ఈ అతడు ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆలయంలోని విగ్రహాలను అతడు ధ్వంసం చేసి పారిపోయాడని అశోక్‌ కుమార్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిని అరెస్టు చేశామని, అతడిని ముహమ్మద్‌ ఇస్మాయిల్‌గా గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై 24 గంటల్లోపు నివేదిక ఇవ్వాలని పోలీసులను బదిన్‌ ఎస్పీ షబ్బీర్‌ ఆదేశించారు.

Updated Date - 2020-10-12T08:28:55+05:30 IST