చైనా దౌత్య కార్యాలయం సైన్ బోర్డుపై నిరసన పోస్టర్

ABN , First Publish Date - 2020-06-23T23:03:27+05:30 IST

గాల్వన్ లోయలో భారత సైనికులపై దాడికి పాల్పడిన చైనాపై భారతీయుల్లో

చైనా దౌత్య కార్యాలయం సైన్ బోర్డుపై నిరసన పోస్టర్

న్యూఢిల్లీ : గాల్వన్ లోయలో భారత సైనికులపై దాడికి పాల్పడిన చైనాపై భారతీయుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఎవరికి తోచినట్లుగా వారు తమ నిరసనను వెల్లడిస్తున్నారు. అదేవిధంగా హిందూ సేన కార్యకర్తలు మంగళవారం నగరంలోని చైనా దౌత్య కార్యాలయం బయట ఉన్న సైన్‌బోర్డుపై ఓ నిరసన పోస్టర్ అంటించారు.


జూన్ 15-16 మధ్య రాత్రి లడఖ్‌లోని గాల్వన్ లోయలో భారతీయ దళాలపై చైనా సైనికులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 20 మంది భారత సైనికులు అమరులు కాగా, 35 మంది చైనా సైనికులు మరణించారు. 76 మంది భారత సైనికులు గాయాలతో చికిత్స పొందుతున్నారు. 


చైనా దుశ్చర్యలపై హిందూ సేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్త మాట్లాడుతూ, వాస్తవాధీన రేఖ వద్ద చైనా దుందుడుకు చర్యలపై తాము నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. చైనా ఓ ద్రోహి అని, హిందీ, చీనీ బై బై అని అన్నారు. తాము చైనా దౌత్య కార్యాలయం సైన్‌బోర్డుపై ఈ నినాదంతో ఓ పోస్టర్‌ను అంటించామని చెప్పారు. 


ఈ సంఘటనపై తమకు ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. ఓ వ్యక్తి చిన్న నల్ల కాగితాన్ని సైన్‌బోర్డుపై అంటించారని, సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించి, నిందితుడిని గుర్తిస్తామని అన్నారు. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదన్నారు.


Read more