ప్రముఖ హిందీ కవి మంగలేష్ కరోనాతో కన్నుమూత

ABN , First Publish Date - 2020-12-10T11:43:14+05:30 IST

ప్రముఖ హిందీ కవి, జర్నలిస్టు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మంగలేష్ దబ్రాల్ (72) కన్నుమూశారు...

ప్రముఖ హిందీ కవి మంగలేష్ కరోనాతో కన్నుమూత

న్యూఢిల్లీ : ప్రముఖ హిందీ కవి, జర్నలిస్టు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మంగలేష్ దబ్రాల్ (72)  కన్నుమూశారు. మంగలేష్ కు  కరోనా వైరస్ సోకడంతో ఏర్పడిన ఆరోగ్య సమస్యలతో గుండెపోటు వచ్చింది. ఢిల్లీలోని ఎయిమ్సులో చికిత్స పొందుతూ దబ్రాల్ మరణించారు. ‘హమ్ జో దేఖ్తే హై’ అనే కవితా సంకలనానికి 2000లో దబ్రాల్ కు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. దబ్రాల్ రాసిన పుస్తకాలు ‘ఆవాజ్ భీ ఏక్ జాగా హై’, ‘పహర్ పర్ లాల్డెన్’ లు ప్రసిద్ధి చెందాయి. దబ్రాల్ రాసిన పుస్తకాలను రష్యన్, జర్మన్, డచ్, స్పానిష్, పోర్చుగీస్, ఇటాలియన్, ఫ్రెంచ్, పోలిష్, బల్గేరియన్లతో సహా పలు విదేశీ భాషలలోకి అనువదించారు. 


హిందీ కవి దబ్రాల్ మరణించినా ఆయన రచనలతో ప్రజల మధ్య ఎల్లప్పుడూ జీవిస్తారని ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ ట్వీట్ చేశారు.ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని టెహ్రీ గర్హ్వాల్ అనే మారుమూల గ్రామంలో జన్మించిన దబ్రాల్ కు కొన్ని వారాల క్రితం కరోనా వైరస్ సోకడంతో అతను న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

Updated Date - 2020-12-10T11:43:14+05:30 IST