హిమాచల్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-08-20T18:23:56+05:30 IST
హిమాచల్‌ప్రదేశ్‌లో రికార్డుస్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 186 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని పారిశ్రామిక...

శిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో రికార్డుస్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 186 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని పారిశ్రామిక జిల్లా సోలన్‌లో కొత్తగా 73 కేసులు నమోదయ్యాయి. సిర్మౌర్‌లోని పాంవటాలో 20, మండీలో 21, చంబాలో 11, బిలాస్‌పూర్‌లో 28, కిన్నౌర్‌లో 10, కంగ్రాలో 6, సిమ్లాలో ఐదు, హమీర్‌పూర్‌లో నాలుగు, ఉనాలో మూడు, కులులో ఐదు చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. చంబాలోని డల్‌హౌసీకి చెందిన 48 ఏళ్ల మహిళ ధర్మశాలలో మృతి చెందింది. అలాగే చంబాకు చెందిన ఒక వ్యక్తి చండీగఢ్‌కు తీసుకువెళుతుండగా మృతిచెందాడు. హిమాచల్‌ప్రదేశ్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 4434కు చేరింది. 1381 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2992 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా కారణంగా మొత్తం 19 మంది మృతిచెందారు.