ప్రియుడితో హిజ్రా ఘర్షణ.. ఆ తర్వాత ఇద్దరు కలిసి...
ABN , First Publish Date - 2020-06-22T13:16:24+05:30 IST
ప్రియుడి సహా హిజ్రా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కార్తెక్కాల్‌లో వెలుగుచూసింది. పుదుచ్చేరి రాష్ట్రం కార్తెక్కాల్ నెహ్రూ నగర్ హౌసింగ్ బోర్డుకు చెందిన

చెన్నై: ప్రియుడి సహా హిజ్రా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కార్తెక్కాల్‌లో వెలుగుచూసింది. పుదుచ్చేరి రాష్ట్రం కార్తెక్కాల్ నెహ్రూ నగర్ హౌసింగ్ బోర్డుకు చెందిన ఫిలిప్‌కుమార్(38) ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు నీరావి నడుఓడుతురైకి చెందిన హిజ్రా శివాని(31)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ మేల్‌ఒడుతురై ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఆరు నెలలుగా కలసి ఉంటున్నారు. శనివారం వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వారిద్దరు ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. చుట్టుపక్కల వారి సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.