హీరోయిన్‌ సంయుక్తపై మూకదాడి

ABN , First Publish Date - 2020-09-06T14:40:40+05:30 IST

బెంగళూరు కోరమంగలలోని అగర పార్కులో శుక్రవారం వర్కవుట్‌ చేసేందుకు స్నేహితులతో కలసి వెళ్లిన ప్రముఖ హీరోయిన్‌ సంయుక్త హెగ్డేపై మూకదాడి జరిగింది.

హీరోయిన్‌ సంయుక్తపై మూకదాడి

అభ్యంతరకర దుస్తులు వేసుకోవడంపై ఆగ్రహం

బెంగళూరు: బెంగళూరు కోరమంగలలోని అగర పార్కులో శుక్రవారం వర్కవుట్‌ చేసేందుకు స్నేహితులతో కలసి వెళ్లిన ప్రముఖ హీరోయిన్‌ సంయుక్త హెగ్డేపై మూకదాడి జరిగింది. సంయుక్త వేసుకున్న దుస్తుల తీరుపై అక్కడ ఉన్న కొందరు తీవ్ర అభ్యంతరం తెలిపారు. స్పోర్ట్స్‌ బ్రా ధరించి పబ్లిక్‌ పార్కులోకి ఎలా వస్తావంటూ దూషణలకు దిగారు. వాగ్వాదం కొనసాగుతుండగానే కవితారెడ్డి అనే మహిళ తన మొబైల్‌ ఫోన్‌లో సంయుక్తహెగ్డే ఫొటోలు తీశారు. అనంతరం ఆమెతోపాటు మరికొందరు సంయుక్తపై ముష్టిఘాతాలు కురిపించారు. సినీనటి స్నేహితులపై కూడా దాడికి దిగారు. సంయుక్త బయటకు వెళ్లకుండా పార్కు తలుపులు వేసేసి పోలీసులకు సమాచారమందించారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని నచ్చచెప్పి అందరినీ పంపేశారు.  

Updated Date - 2020-09-06T14:40:40+05:30 IST