హీరో విజయ్ నటిస్తున్న ‘మాస్టర్’ సహ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు

ABN , First Publish Date - 2020-03-12T20:35:21+05:30 IST

సినీ నిర్మాత లలిత్ కుమార్ నివాసం, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి.

హీరో విజయ్ నటిస్తున్న ‘మాస్టర్’ సహ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు

చెన్నై : సినీ నిర్మాత లలిత్ కుమార్ నివాసం, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. 


హీరో విజయ్ నటిస్తున్న ‘మాస్టర్’కు లలిత్ కుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విజయ్ సినిమాలకు సంబంధించిన వ్యక్తులపై ఐటీ దాడులు జరగడం ఈ ఏడాది ఇది రెండోసారి. 


సాలిగ్రామం, పనియుర్‌లలోని విజయ్ నివాసాల్లో గత నెలలో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో నైవేలీలో ‘మాస్టర్’ షూటింగ్‌లో ఉన్న విజయ్‌‌ని తీసుకొచ్చారు. ఫైనాన్షియర్, ప్రొడ్యూసర్ అంబు చెజియన్‌కు చెందిన వివిద ప్రదేశాల్లో జరిపిన సోదాల్లో రూ.165 కోట్ల పన్ను ఎగవేసినట్లు వెల్లడైంది. 


Updated Date - 2020-03-12T20:35:21+05:30 IST