చైనా వైరాలజిస్ట్ ట్విటర్ ఖాతా క్లోజ్... ఆ రహస్యాన్ని బయటపెట్టినందుకే

ABN , First Publish Date - 2020-09-17T21:41:49+05:30 IST

కొవిడ్-19 వైరస్ ను వూహాన్ ల్యాబ్ లో డెవలప్ చేశారంటూ బహిరంగంగా ప్రకటించిన వైరాలజిస్ట్ లీ-మెంగ్ యాన్ ట్విటర్ అకౌంట్ క్లోజ్ అయింది. తమ దేశ ప్రభుత్వం కావాలనే ఈ వైరస్ నిు ఉత్పత్తి చేసి, రిలీజ్ చేసిందని ఆమె ప్రకటించింది.

చైనా వైరాలజిస్ట్ ట్విటర్ ఖాతా క్లోజ్... ఆ రహస్యాన్ని బయటపెట్టినందుకే

బీజింగ్ : కొవిడ్-19 వైరస్ ను  వూహాన్ ల్యాబ్ లో డెవలప్ చేశారంటూ బహిరంగంగా ప్రకటించిన  వైరాలజిస్ట్ లీ-మెంగ్ యాన్ ట్విటర్ అకౌంట్ క్లోజ్ అయింది. తమ దేశ ప్రభుత్వం కావాలనే ఈ వైరస్ నిు ఉత్పత్తి చేసి, రిలీజ్ చేసిందని ఆమె ప్రకటించింది. 


ఈ క్రమంలో.. ఆమె అకౌంట్ ను ట్విటర్ మూసివేసింది. ‘అకౌంట్ సస్పెండెడ్.. ట్విటర్ సస్పెండ్స్ అకౌంట్స్ విచ్ వయోలేట్స్ ది ట్విటర్ రూల్స్’ అంటూ ఆమె ట్విట్టర్ ఖాతాలో ఓ మెసేజ్ ప్రత్యక్షమైంది. అయితే... కారణాలను మాత్రం తెలియజేయలేదు.


కరోనా వైరస్ కు సంబంధించిన వివాదాస్పద కంటెంట్ ను ట్వీట్స్ ను ఆపేస్తామంటూ ఈ సోషల్ జెయింట్ మే నెలలోనే  హెచ్చరించింది. కాగా-తన ఖాతా తొలగింపుపై స్పందించిన లీ-మెంగ్...  వాస్తవాలను తెలుసుకోవడానికి ‘ఇలాంటి వారు’ ఇష్టపడరని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్య... ప్రభుత్వ పెద్దలనుద్దేశించి చేసిందేనని భావిస్తున్నారు. కోవిడ్ వైరస్ మనిషి చేసిందే తప్ప ..ప్రకృతి నుంచి వచ్చింది కాదని ఆమె పేర్కొన్న విషయం తెలిసిందే. 



చైనా ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందన్న ఆందోళనతో... ఈమె తన మకాంను హాంకాంగ్‌కు మార్చింది. తనకే కాక, తన కుటుంబ సభ్యులకు కూడా  చైనా ప్రభుత్వం హాని తలపెట్టవచ్ఛునని  లీ భయపడుతోంది. అయితే ప్రపంచానికి నిజాలు తెలియజేస్తానని ధైర్యంగా చెబుతోంది. ఈ వైరస్... వూహాన్  లేబొరేటరీలో పుట్టిందని, ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయని ఈ వైరాలజిస్ట్ వెల్లడించిది.

Updated Date - 2020-09-17T21:41:49+05:30 IST