ఆమె సరికొత్త రికార్డ్... 232 ఏళ్ల చరిత్రలో తొలి మహిళగా...
ABN , First Publish Date - 2020-12-01T22:05:20+05:30 IST
అమెరికా ఆర్థిక మంత్రిగా జనెత్ యెలెన్ నియమితులు కానున్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ ఇప్పటికే ఆమె పేరును నామినేట్ చేశారు. దీనికి యూఎస్ సెనెట్ అంగీకారం తెలపడమే ఆలస్యం. సెనెట్ అంగీకరించినపక్షంలో ఆమె ఓ కొత్త చరిత్ర సృష్టించినట్లవుతుంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.

వాషింగ్టన్ : అమెరికా ఆర్థిక మంత్రిగా జనెత్ యెలెన్ నియమితులు కానున్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ ఇప్పటికే ఆమె పేరును నామినేట్ చేశారు. దీనికి యూఎస్ సెనెట్ అంగీకారం తెలపడమే ఆలస్యం. సెనెట్ అంగీకరించినపక్షంలో ఆమె ఓ కొత్త చరిత్ర సృష్టించినట్లవుతుంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.
అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక మంత్రి పదవికి జనెత్ యెలెన్‌ను నామినేట్ చేశారు. ఆర్థిక మంత్రి పదవి కోసం ఈమె పేరును సిఫార్సు చేశారు. భారతీయ అమెరికన్ నీరా టండెన్‌ను డైరెక్టర్ ఆఫ్ ఆఫీస్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్‌కు నామినేట్ చేశారు.
ఈ క్రమంలో... బిడెన్ సిఫార్సులకు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపినపక్షంలో సరికొత్త చరిత్ర నమోదు కానుంది. అమెరికా 232 ఏళ్ల చరిత్రలో తొలి మహిళా ఆర్థిక మంత్రిగా యెలెన్(74) ఘనత సాధించనున్నారు. అదేసమయంలో టండెన్ పదవి కూడా ఓకే అయితే ఈమె కూడా ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ బాధ్యతలు చూసుకునే తొలి నల్లజాతీయ మహిళగా రికార్డ్ సృష్టించనున్నారు.
అంతేకాదు... సీనియర్ కమ్యూనికేషన్స్ రోల్స్‌కు సంబంధించి కూడా పూర్తిగా మహిళలనే జో బిడెన్ నియమించారు. ఇలా జరగడం కూడా ఇదే మొదటిసారి. కాగా... ఆర్థిక మంత్రి పదవికి నామినేట్ అయిన మెలెన్ విషయానికొస్తే... ఈమె 2018 వరకు సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వు చైర్మన్‌గా వ్యవహరించారు. ఆర్థిక అంశాలపై ఈమెకు పూర్తి పట్టు ఉంది. బిడెన్ ఆర్థిక విధానాలను ముందుకు తీసుకెళ్లడంతో ఈమె కీలక పాత్ర పోషించనున్నట్లు చెబుతున్నారు.