మహిళ లొంగిపోతే ఒప్పుకున్నట్లు కాదు!

ABN , First Publish Date - 2020-07-08T06:55:19+05:30 IST

అత్యాచార ఘటనలో నిస్సహాయురాలైన మహిళ లొంగిపోయినంతమాత్రాన ఆ లైంగిక చర్యకు ఆమె అంగీకరించినట్లుగా భావించరాదని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది...

మహిళ లొంగిపోతే ఒప్పుకున్నట్లు కాదు!

  • దళిత బాలికపై రేప్‌ కేసులో హైకోర్టు తీర్పు


కోచి, జూలై 7: అత్యాచార ఘటనలో నిస్సహాయురాలైన మహిళ లొంగిపోయినంతమాత్రాన ఆ లైంగిక చర్యకు ఆమె అంగీకరించినట్లుగా భావించరాదని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. 2009లో కేరళలో ఒక దళిత బాలికపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టి ఆమె గర్భం దాల్చేందుకు కారకుడైన ఒక వృద్ధుడి అప్పీలును రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. కింది కోర్టు అతనికి వేసిన శిక్షను ఖరారు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ పీబీ సురేశ్‌ కుమార్‌  ఇటీవల తీర్పు ఇచ్చారు. మన దేశంలో స్త్రీ పురుషుల మధ్య ఇష్టపూర్వకంగా జరిగే లైంగిక చర్య మాత్రమే పరస్పర అంగీకారమైనదిగా భావించవచ్చని, ఇందులో బాధిత వ్యక్తి హక్కుల ఉల్లంఘనకు ఆస్కారం లేదని హైకోర్టు పేర్కొంది. ఆ యువతి కోర్టుకు సమర్పించిన సాక్ష్యాధారాల ప్రకారం పరస్పరం ఇష్ట ప్రకారమే తమ మధ్య సంబంధం ఏర్పడినట్లుగా అసందిగ్ధంగా రుజువయ్యిందని నిందితుడు వాదించాడు. అయితే, అత్యాచారానికి పాల్పడినట్లుగా సాక్ష్యాధారాలు బాధితురాలు ఇచ్చిందని కోర్టు అభిప్రాయపడింది.  


Updated Date - 2020-07-08T06:55:19+05:30 IST