హెలికాప్టర్ కూలి పైలెట్ మృతి

ABN , First Publish Date - 2020-08-20T12:47:35+05:30 IST

సెంట్రల్ కాలిఫోర్నియా అడవుల్లో రేగిన కార్చిచ్చును ఆర్పబోయిన హెలికాప్టరు ప్రమాదవశాత్తూ కుప్పకూలి పోవడంతో పైలెట్ మృతి....

హెలికాప్టర్ కూలి పైలెట్ మృతి

కాలిఫోర్నియాలో మంటలను ఆర్పబోయి... 

వకావిల్లే (కాలిఫోర్నియా): సెంట్రల్ కాలిఫోర్నియా అడవుల్లో రేగిన కార్చిచ్చును ఆర్పబోయిన హెలికాప్టరు ప్రమాదవశాత్తూ కుప్పకూలి పోవడంతో పైలెట్ మృతి చెందారు.దక్షిణ కోలింగాలోని వెస్ట్రన్స్ ఫ్రెస్నో ప్రాంతంలోని అడవిలో కార్చిచ్చు రేగింది. అడవిలో రేగిన మంటలను ఆర్పేందుకు బెల్ యూహెచ్-1 హెచ్ హెలికాప్టరుతో నీళ్లు చల్లేందుకు పంపించారు. అడవిలో మంటలను ఆర్పుతుండగా ఒక్కసారిగా హెలికాప్టరు కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టరులో ఉన్న పైలెట్ మరణించారు. అడవిలో రేగిన మంటలతో శాన్ ఫ్రాన్సిస్ కో ప్రాంతంలో వేలాదిమందిని ఖాళీ చేయించి సురక్షితప్రాంతాలకు తరలించారు.

Read more