ఢీల్లీని వణికిస్తున్న భారీ వర్షాలు

ABN , First Publish Date - 2020-08-20T22:14:17+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. జోరు వానలకు రాజధాని వీథులు నీట మునిగాయి.

ఢీల్లీని వణికిస్తున్న భారీ వర్షాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. జోరు వానలకు రాజధాని వీథులు నీట మునిగాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షాలకు ఢిల్లీ రహదారులన్నీ జలమయం అయ్యాయి. చాలాచోట్ల మోకాలు లోతు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులుపడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీతోపాటు దాద్రి, మీరట్, నోయిడా, ఘజియాబాద్, ఫరిదాబాద్, మోతీనగర్, గురుగ్రాంలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. హరియాణాలోని కురుక్షేత్రంలో కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. ఢిల్లీలో ఈ నెల 25 వరకు భారీ వర్ష సూచన ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.


Updated Date - 2020-08-20T22:14:17+05:30 IST