హృద్రోగులకు రెండోసారీ కరోనా రావచ్చు!!

ABN , First Publish Date - 2020-06-25T07:34:38+05:30 IST

యాభై ఏళ్లకు పైబడి, హృద్రోగాలు, అధిక రక్తపోటు కలిగిన వారు కరోనా నుంచి కోలుకున్నా.. మళ్లీ ఇన్ఫెక్షన్‌ సోకే అవకాశాలు ఉంటాయని చైనా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 938 మంది కొవిడ్‌ రోగుల ఆరోగ్య స్థితిగతుల్లో వచ్చిన మార్పులను 44 రోజుల పాటు పరిశీలించగా...

హృద్రోగులకు రెండోసారీ కరోనా రావచ్చు!!

బీజింగ్‌, జూన్‌ 24 : యాభై ఏళ్లకు పైబడి, హృద్రోగాలు, అధిక రక్తపోటు కలిగిన వారు కరోనా నుంచి కోలుకున్నా.. మళ్లీ ఇన్ఫెక్షన్‌ సోకే అవకాశాలు ఉంటాయని చైనా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 938 మంది కొవిడ్‌ రోగుల ఆరోగ్య స్థితిగతుల్లో వచ్చిన మార్పులను 44 రోజుల పాటు పరిశీలించగా.. వారిలో 58 మందికి రెండోసారీ కరోనా పాజిటివ్‌ వచ్చిందన్నారు. అయితే కొన్ని రోజుల చికిత్స అనంతరం వీరిలో 54 మందికి మళ్లీ నెగెటివ్‌ వచ్చిందని వెల్లడించారు.  


Updated Date - 2020-06-25T07:34:38+05:30 IST