భారత్‌లో కరోనా ప్రభావంపై కేంద్ర ఆరోగ్య శాఖ తాజా అప్‌డేట్..

ABN , First Publish Date - 2020-04-07T21:53:53+05:30 IST

కేంద్ర ఆరోగ్య శాఖ భారత్‌లో కరోనా ప్రభావానికి సంబంధించి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో భారత్‌లో...

భారత్‌లో కరోనా ప్రభావంపై కేంద్ర ఆరోగ్య శాఖ తాజా అప్‌డేట్..

24 గంటల్లో 354 కొత్త పాజిటివ్ కేసులు: కేంద్ర ఆరోగ్య శాఖ

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ భారత్‌లో కరోనా ప్రభావానికి సంబంధించి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో భారత్‌లో 354 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దీంతో.. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4421కి చేరినట్లు ఆయన తెలిపారు.


24 గంటల్లో 8 మంది కరోనా బారిన పడి మరణించినట్లు లవ్ అగర్వాల్ చెప్పారు. 326 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు 3 రకాల సదుపాయాలను కేంద్రం సిద్ధం చేసిందని లవ్ అగర్వాల్ వెల్లడించారు. భౌతిక దూరాన్ని పాటించడమే కోవిడ్-19ను దరిచేరనీయకుండా ఉన్న మార్గమని ఆయన స్పష్టం చేశారు. భారతీయ రైల్వే 40వేల ఐసోలేషన్ బెడ్స్‌ను సిద్ధం చేసిందని తెలిపారు.

Read more