కరోనా గొలుసు తెగాలంటే మూడు వారాలు తప్పనిసరి: మోదీ

ABN , First Publish Date - 2020-03-25T02:08:03+05:30 IST

కరోనా గొలుసును తెంచాలంటే 21 రోజులు పడుతుందని అందుకే మూడు వారాల పాటు దేశంలో లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నామని మోదీ పేర్కొన్నారు. దేశంలోని ప్రజలు ఎక్కడికీ వెళ్లవద్దని, ఏ రాష్ట్రంలోని ఆ రాష్ట్రంలోనే.. ఏ ప్రాంతంలోని వారు

కరోనా గొలుసు తెగాలంటే మూడు వారాలు తప్పనిసరి: మోదీ

న్యూఢిల్లీ: దేశంలోని అన్ని రాష్ట్రాల తొలి ప్రాధాన్యం వైద్యమే కావాలని కోరామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వైద్య సదుపాయాల్ని మెరుగుపర్చుకునేందుకు రూ.15 వేల కోట్ల నిధులు సమకూరుస్తున్నామనా ఆయన అన్నారు. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులపై మంగళవారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మెడికల్‌, పారామెడికల్‌ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు, ల్యాబ్‌లు ప్రభుత్వాలకు సహకరిస్తున్నాయని కొనియాడారు.


కరోనా గొలుసును తెంచాలంటే 21 రోజులు పడుతుందని అందుకే మూడు వారాల పాటు దేశంలో లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నామని మోదీ పేర్కొన్నారు. దేశంలోని ప్రజలు ఎక్కడికీ వెళ్లవద్దని, ఏ రాష్ట్రంలోని ఆ రాష్ట్రంలోనే.. ఏ ప్రాంతంలోని వారు ఆ ప్రాంతంలోనే ఉండాలని ఆయన అన్నారు. ప్రజల సహకారం ఉంటేనే కరోనా విజయం సాధిస్తామని మోదీ అన్నారు.

Read more