రంజాన్ కోసం కాదు.. అమ్మను చూడడానికి వచ్చాడు: నవాజుద్దీన్ సోదరుడి ట్వీట్

ABN , First Publish Date - 2020-05-19T00:10:32+05:30 IST

రంజాన్ పండుగ జరుపుకొనేందుకు నవాజుద్దీన్ సిద్దికీ ముంబై నుంచి యూపీకి వెళ్లారంటూ వార్తలు వచ్చిన విషయం...

రంజాన్ కోసం కాదు.. అమ్మను చూడడానికి వచ్చాడు: నవాజుద్దీన్ సోదరుడి ట్వీట్

లక్నో: రంజాన్ పండుగ జరుపుకొనేందుకు నవాజుద్దీన్ సిద్దికీ ముంబై నుంచి యూపీకి వెళ్లారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన సోదరుడు అయాజుద్దీన్ సిద్దికీనే స్ఫష్టం చేసినట్లు ఆయా వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అయితే దీనిపై ఆయన సోదరుడు షమాస్ సిద్దికీ ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చారు. నవాజుద్దీన్ రంజాన్ వేడుక జరుపుకొనేందుకు ఇంటికి రాలేదని చెప్పారు. తమ సోదరి ఇటీవల క్యాన్సర్‌తో మరణించినప్పటి నుంచి అమ్మకు ఆరోగ్యం బాగాలేదని, ఆమెను చూసేందుకే నవాజ్ ఇంతదూరం వచ్చాడని చెప్పుకొచ్చారు.  దీనికి సంబంధించి పోలీసుల నుంచి తీసుకున్న పర్మిషన్ లెటర్‌ను కూడా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Updated Date - 2020-05-19T00:10:32+05:30 IST