నేను పోయినా జేడీఎస్ ఉంటుంది: దేవేగౌడ
ABN , First Publish Date - 2020-12-27T09:54:38+05:30 IST
‘‘నేను ఉన్నంత కాలమే కాదు. నేను పోయిన తర్వాత కూడా జేడీఎస్ ఉంటుంది. అందుకే నా పోరాటం’’ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవేగౌడ

బెంగళూరు, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): ‘‘నేను ఉన్నంత కాలమే కాదు. నేను పోయిన తర్వాత కూడా జేడీఎస్ ఉంటుంది. అందుకే నా పోరాటం’’ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవేగౌడ అన్నారు. ఉత్సాహం, విశ్వాసం ఉన్న కార్యకర్తలు తమకు అండగా ఉన్నారని పార్టీని మళ్లీ బలోపేతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో జేడీఎస్ విలీనమవుతుందనే వదంతులు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కొందరు సృష్టించినవేనన్న దేవెగౌడ.. ఎప్పటికీ అలాం టి ప్రతిపాదన ఉండబోదని చెప్పారు. ఈ మేరకు శనివారం పార్టీ కార్యాలయంలో దేవెగౌడ మీడియాతో మాట్లాడారు.