శానిటైజర్ తాగి జాతీయ కుస్తీ క్రీడాకారుడు మృతి

ABN , First Publish Date - 2020-10-21T16:35:07+05:30 IST

జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో, ఏ క్షణాన ఏమి జరుగుతుందో ఎవరూ ముందుగా గ్రహించలేరు. ఇదే హిమాచల్...

శానిటైజర్ తాగి జాతీయ కుస్తీ క్రీడాకారుడు మృతి

బిస్తార్(చండీగఢ్): జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో, ఏ క్షణాన ఏమి జరుగుతుందో ఎవరూ ముందుగా గ్రహించలేరు. ఇదే హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన అజయ్ ఠాకూర్ ఉరఫ్ అజ్జూ విషయంలో జరిగింది. నాలాగఢ్‌లోని సైజీ‌మరాజ్ నివాసి అజయ్ జాతీయ కుస్తీ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించారు. 


ఇంతేకాదు సైన్యంలో సుబేదారుగా మూడేళ్లపాటు తన సేవలను అందించారు. అయితే ఆ తరువాత అజయ్ తనకు ఆ ఉద్యోగం నచ్చలేదంటూ మాసివేశారు. శానిటైజర్ తాగడంతో మృతి చెందారు. అజయ్ తన స్నేహితులతో పాటు గ్రామంలోని యువకులకు కుస్తీ నేర్పించడం ప్రారంభించారు. అయితే 11 నెలల క్రితం ఒక దోపిడీ కేసులో హస్తం ఉన్న నేపధ్యంలో అజయ్ జైలుకు వెళ్లాడు. రెండు రోజులుగా అజయ్ శానిటైజర్ తాగుతున్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అజయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-10-21T16:35:07+05:30 IST