హాథ్రస్ ఘటనలో నిందితులకు ఉన్నతవర్గాల మద్ధతు...

ABN , First Publish Date - 2020-10-03T12:27:09+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హాథ్రస్ ఘటనలో నిందితులకే ఉన్నతవర్గాలు మద్ధతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది....

హాథ్రస్ ఘటనలో నిందితులకు ఉన్నతవర్గాల మద్ధతు...

పంచాయతీ పెద్దల నిర్ణయం

సీబీఐ విచారణకు డిమాండ్

లక్నో (ఉత్తరప్రదేశ్): దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హాథ్రస్ ఘటనలో నిందితులకే ఉన్నతవర్గాలు మద్ధతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. బాధితురాలి ఇల్లు ఉన్న బూల్ గడీ గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని భగ్న గ్రామంలో పెద్దలు పంచాయతీ నిర్వహించారు. హాథ్రస్ ఘటనలో అరెస్టు అయిన నిందితులకే న్యాయం చేయాలని సావర్న్ సమాజ్ కు చెందిన పెద్దలు డిమాండు చేశారు. ఈ మేర సావర్న్ సమాజ్ పెద్దలు శుక్రవారం ధర్నా కూడా చేశారు. హాథ్రస్ కేసులో నిందితులు అమాయకులని, వారిపై నిందలు వేస్తున్నారని పంచాయతీ పెద్దలు చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


మృతురాలి తల్లి, సోదరుడిని ప్రశ్నిస్తే అసలు వాస్తవాలు తెలుస్తాయని పంచాయతీ పెద్దలు చెప్పారు. ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని పంచాయతీ పెద్దలు డిమాండు చేశారు. కాగా బాధిత మృతురాలికి న్యాయం చేయాలని డిమాండు చేస్తూ వాల్మీకీ కులం కార్యకర్తలు యూపీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు. 

Updated Date - 2020-10-03T12:27:09+05:30 IST