ఢిల్లీ పోలీసులు నేర న్యాయ వ్యవస్థను ఎగతాళి చేశారు : పి. చిదంబరం

ABN , First Publish Date - 2020-09-14T00:08:26+05:30 IST

ఢిల్లీ అల్లర్ల కేసులో సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరీతో పాటు మరో ఇద్దరిపై అభియోగం మోపడాన్ని

ఢిల్లీ పోలీసులు నేర న్యాయ వ్యవస్థను ఎగతాళి చేశారు : పి. చిదంబరం

న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్ల కేసులో సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరీతో పాటు మరో ఇద్దరిపై అభియోగం మోపడాన్ని కాంగ్రెస్ అగ్రనేత పి. చిదంబరం తప్పబట్టారు. వీరిపై అభియోగం మోపి ఢిల్లీ పోలీసులు నేర న్యాయ వ్యవస్థను ఎగతాళి చేశారని మండిపడ్డారు. ‘‘సమాచారం, ఛార్జిషీట్ మధ్య రెండు అంచెలున్నాయి. ఒకటి దర్యాప్తు కాగా, మరొకటి సమచారాన్ని సాక్ష్యాధారాలతో బలపరచడం. ఈ రెండు అంచెలను ఢిల్లీ పోలీసులు మరిచిపోయినట్టున్నారు’’ అంటూ చిదంబరం ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.


ఢిల్లీ అల్లర్ల కేసులో ఏచూరీ, యోగేంద్ర, జయతీ ఘోష్, అపూర్వానంద్ ను కుట్ర దారులుగా చేర్చి నేర న్యాయవ్యవస్థను ఎగతాళి చేశారని చిదంబరం మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, స్వరాజ్ అభియాన్ నేత యోగానంద్‌తో పాటు మరికొందరు సహ కుట్ర దారులంటూ ఢిల్లీ పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. 

Updated Date - 2020-09-14T00:08:26+05:30 IST