కరోనా రిపోర్ట్: హర్యానాలో 6వేలకు చేరువైన కేసులు

ABN , First Publish Date - 2020-06-12T03:07:10+05:30 IST

హర్యానాలో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతి రోజూ వందల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయంటే...

కరోనా రిపోర్ట్: హర్యానాలో 6వేలకు చేరువైన కేసులు

చండీఘర్: హర్యానాలో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతి రోజూ వందల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేడు కూడా రాష్ట్రంలో కొత్తగా 400 వరకు కోవిడ్-19 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ద్వారా తెలుస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 389 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 12 మంది మరణించారు. 72 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 5,968కి చేరింది. 3,644 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 2,260 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 64 మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2020-06-12T03:07:10+05:30 IST