2 లక్షల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న హర్యానా పోలీసులు

ABN , First Publish Date - 2020-05-14T02:41:00+05:30 IST

అష్ట దిగ్బంధనం సమయంలో దాదాపు 972 కేజీల నార్కొటిక్ సబ్‌స్టాన్సెస్‌,

2 లక్షల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న హర్యానా పోలీసులు

న్యూఢిల్లీ : అష్ట దిగ్బంధనం సమయంలో దాదాపు 972 కేజీల నార్కొటిక్ సబ్‌స్టాన్సెస్‌, 2 లక్షలకుపైగా లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు హర్యానా పోలీసులు తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నిరోధం కోసం అమలు చేస్తున్న దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం సమయంలో హర్యానాలోని వివిధ ప్రాంతాలలో వీటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 


హిసార్ రేంజ్‌లో ఐదుగురు వాంటెడ్ క్రిమినల్స్‌ను 48 మంది ఇతర నేరస్థులను అరెస్టు చేసినట్లు హర్యానా పోలీసులు తెలిపారు. ఈ రేంజ్‌ పరిథిలోకి హిసార్, జింద్, సిర్సా, ఫతేబాద్, హన్సీ పోలీస్ డిస్ట్రిక్ట్స్ వస్తాయన్నారు.


డీజీపీ మనోజ్ యాదవ విడుదల చేసిన ప్రకటనలో, అష్ట దిగ్బంధనం సమయంలో దాదాపు 972 కేజీల నార్కొటిక్ సబ్‌స్టాన్సెస్‌, 2.04 లక్షలకుపైగా లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అష్ట దిగ్బంధనం నేపథ్యంలో నిఘాను పెంచామని చెప్పారు. హిసార్ రేంజ్‌లో ఐదుగురు వాంటెడ్ క్రిమినల్స్‌ను 48 మంది ఇతర నేరస్థులను అరెస్టు చేసినట్లు, నార్కొటిక్ సబ్‌స్టాన్సెస్ కలిగి ఉన్నందుకు 261 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
Read more