ఆసుపత్రి నుంచి అనిల్ విజ్ డిశ్చార్జి

ABN , First Publish Date - 2020-12-30T21:59:42+05:30 IST

హర్యానా హోం, ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ ఆసుపత్రి నుంచి బుధవారంనాడు డిశ్చార్జి

ఆసుపత్రి నుంచి అనిల్ విజ్ డిశ్చార్జి

గురుగావ్: హర్యానా హోం, ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ ఆసుపత్రి నుంచి బుధవారంనాడు డిశ్చార్జి అయ్యారు. మేదాంత ఆసుపత్రి నుంచి తాను డిశ్చార్చి అయ్యానని, ఆక్సిజన్ సపోర్ట్‌తో ఇంటిలోనే ఉండాల్సి ఉంటుందని ఆయన ఒక ట్వీట్‌లో తెలిపారు.


డిసెంబర్ 5న అనిల్ విజ్ కోవిడ్-19తో ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. డిసెంబర్ 15 నుంచి ఆయన గురుగావ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. తొలుత ఐసీయూలో ఉంచి ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి నిలకగా ఉండటంతో డిసెంబర్ 23న కోవిడ్ వార్డుకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఇంట్లో ఆక్సిజన్ సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.


కాగా, గత నవంబర్ 20న ఆయన ఒక ఆసుపత్రిలో 'కోవాక్సిన్' డోస్ తీసుకున్నారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న ఈ వాక్సిన్ మూడో దశ ట్రయిల్‌లో ఉండగా ఆయన వలంటీర్‌గా తొలి డోసు  తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన కోవిడ్ బారిన పడటంతో తాను తొలి డోసు మాత్రమే తీసుకున్నానని, రెండో డోసు పెండింగ్‌లో ఉందని విజ్ వివరణ ఇచ్చారు.

Updated Date - 2020-12-30T21:59:42+05:30 IST